Advertisement

Rythu Bharosa: సాగు చేసిన వారికే నిధులు.. ఆలస్యం తప్పదా?

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో (Telangana) యాసంగి సీజన్ రైతు భరోసా (TG Rythu Bharosa) పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పంట సాగు చేసిన రైతులకే ఈ పెట్టుబడి సాయం అందించాలని భావిస్తోంది. ఇందుకోసం శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కించిన తర్వాతే నిధులు జమ చేయనున్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించి, శాటిలైట్ చిత్రాల ద్వారా పంట విస్తీర్ణాన్ని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం.

Advertisement

అయితే, ఈ కొత్త విధానం కారణంగా యాసంగి పెట్టుబడి సాయం రైతులకు అందడంలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వానాకాలం నష్టాలతో సతమతమవుతున్న అన్నదాతలు, యాసంగి సాగు కోసం ప్రభుత్వ సాయంపైనే ఆశలు పెట్టుకున్నారు.

Advertisement