తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠశాలలకు వరుసగా 9 రోజుల పాటు సెలవులను ఖరారు చేసింది. జనవరి 10 (రెండో శనివారం) నుంచి సెలవులు మొదలై జనవరి 18 (ఆదివారం) వరకు కొనసాగుతాయని, తిరిగి జనవరి 19న బడులు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు.
గత ఏడాది కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండగా, ఈసారి శని, ఆదివారాలు కలిసి రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా దాదాపు ఇదే విధంగా 9 రోజులు సెలవులు ప్రకటించారు. ఇవే కాకుండా జనవరి 1న నూతన సంవత్సరం, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
