మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉపాధ్యాయుల ( Telangana Teachers ) సర్దుబాటు ప్రక్రియపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ( DEO Naveen Nicolas ) అక్టోబర్ 30న కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మిగులు (Surplus) ఉపాధ్యాయులను అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేసే ప్రక్రియ పూర్తయినట్లు డీఈఓలు నివేదించినా, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆన్‌లైన్ నివేదికల ప్రకారం, జిల్లాల్లో మిగులు టీచర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని పాఠశాలల్లో ఇప్పటికీ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాధికారులు (DEOs) వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కొరత ఉన్న పాఠశాలల జాబితాను, మిగులు టీచర్లు ఉన్న జాబితాను సరిచూసి, తక్షణమే సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే, రిటైర్మెంట్ లేదా దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిన వారి స్థానంలో కూడా అవసరమైతే మిగులు టీచర్లను డిప్యుటేషన్‌పై నియమించాలని ఆదేశించారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

