భారీ వర్షాలు తెలంగాణను మూడు రోజులుగా వదిలిపెట్టడం లేదు. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం, శనివారం (సెప్టెంబర్ 27) కూడా వర్షాలు కొనసాగనున్నాయి. ఇవాళ మరో మూడు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఈ హెచ్చరిక వర్తిస్తుంది.
ఈ ప్రాంతాల్లో రెండు నుంచి మూడు గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని సూచించారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
గరిష్ఠ ఉపరితల గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉండనుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
