Advertisement

తెలంగాణలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ సిద్ధం

మన పత్రిక, వెబ్​డెస్క్

Advertisement

తెలంగాణ ప్రభుత్వం కొత్త విద్యా విధానం (TEP) రూపకల్పనకు సిద్ధమైంది. తమిళనాడు తరహాలో రాష్ట్రానికి అనుగుణమైన ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ పాలసీ రూపకల్పనకు గాను ప్రభుత్వ అడ్వైజర్ కె. కేశవరావు నేతృత్వంలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

జాతీయ విద్యా విధానం (NEP) ని దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా TEP రూపొందించాలని సూచించారు. కమిటీ సభ్యులు విద్యా రంగ నిపుణులు, అధికారులు, పాలసీ నిర్మాతలతో కూడి ఉంటారు. ఈ పాలసీ ద్వారా పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు నాణ్యమైన బోధన, సమగ్ర అభివృద్ధి, సమాన అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన ప్రక్రియలో ప్రజల అభిప్రాయాలు, ఉపాధ్యాయుల సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. కమిటీ త్వరలో తొలి సమావేశం నిర్వహించనుంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement