Advertisement
NO PRACTICAL EXAM CENTRES IN SOCIAL WELFARE and KGBV Colleges

TG Inter Practicals: గురుకులాలు, కేజీబీవీలలో సెంటర్లు రద్దు!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాలు, మోడల్ స్కూల్స్ మరియు కేజీబీవీ ఇంటర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాలను ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో, ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇకపై సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

Advertisement

అయితే, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లోని ప్రాక్టికల్ కేంద్రాలను యథాతథంగా కొనసాగించడం గమనార్హం. కేవలం గురుకులాల్లోని సెంటర్లను ఎత్తివేయడంపై ఆయా విద్యాసంస్థల వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement