మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణలో మహిళా సాధికారత, పాడి పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు( Indira Dairy Project )’ పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఒక్కో సభ్యురాలికి రూ.2 లక్షల విలువైన రెండు పాడి గేదెలు లేదా ఆవులను పంపిణీ చేయనున్నారు.
భారీ సబ్సిడీ: ఈ పథకం కింద యూనిట్ ధర రూ.2 లక్షలు కాగా, ఇందులో ప్రభుత్వం ఏకంగా 70 శాతం (రూ.1.40 లక్షలు) సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 30 శాతం (రూ.60 వేలు) బ్యాంకుల ద్వారా రుణంగా అందిస్తారు.
పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. త్వరలోనే సీఎం నియోజకవర్గం కొడంగల్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు.
ఫీచర్స్:
- ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్‌గా, మండలాన్ని 3 జోన్లుగా విభజిస్తారు.
- రవాణా కోసం ట్రాలీ ఆటోలు, పశువుల షెడ్లకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తారు.
- పశువైద్యులు ప్రతి నెలా తనిఖీ చేసి హెల్త్ కార్డులు జారీ చేస్తారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
