మన పత్రిక, హైదరాబాద్: కాలుష్య నియంత్రణపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే వారికి 20 శాతం మేర డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోనూ రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పర్యావరణ ముప్పును అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగమే సరైన మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే పర్యావరణ హిత వాహనాల వాడకాన్ని పెంచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉద్యోగులకు ఈ ఆఫర్ అమలు చేసేందుకు సిద్ధమైంది.
ఉద్యోగులకు ఈ 20 శాతం డిస్కౌంట్ రాయితీని ఏ విధంగా వర్తింపజేయాలి? దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు ఏమిటి? తదితర వివరాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఎస్ఎస్బీలో 233 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
- మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు: హాలియా పోలీసుల వార్నింగ్
- ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్: భారత్‌లో బీర్ల కొరత.. భారీగా పెరగనున్న ధరలు!
- బ్రిటన్‌కు యుద్ధ భయం: 5 ఏళ్లలో యుద్ధం తప్పదంటున్న 40 శాతం ప్రజలు
- మధ్యప్రాచ్యంలో భగ్గుమన్న ఉద్రిక్తతలు: టెల్ అవీవ్‌పై ఇరాన్ దాడులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ పట్టు
