Advertisement

TG News: సాగునీటి శాఖ రూ. 22 వేల కోట్ల బకాయిలు

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు కొండలా పేరుకుపోవడంతో సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. గత ఐదేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పెరిగాయి.

ఈ జాబితాలో సాగునీటి పారుదల శాఖ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒక్క శాఖే ఏకంగా రూ. 22,926 కోట్లు బాకీ పడటం గమనార్హం. ఆ తర్వాత హైదరాబాద్ వాటర్ బోర్డు రూ. 7,084 కోట్లు, మిషన్ భగీరథ రూ. 5,972 కోట్లు చెల్లించాల్సి ఉంది. డిస్కమ్‌లను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఈ బకాయిల వసూలు బాధ్యతను కొత్త పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి అప్పగించింది.

Advertisement
Advertisement