Advertisement

తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో 2,832 ఖాళీలు

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 149 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 2,832 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తాజా సమాచారం. వీటిలో కేవలం 200 మంది మాత్రమే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా, మిగిలిన పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి.

విభాగాల వారీగా చూస్తే.. అత్యధికంగా 2,569 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. అలాగే 62 ప్రిన్సిపల్ పోస్టులు, 110 ఫిజికల్ డైరెక్టర్, 91 లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాస్తవానికి ఈ పోస్టుల భర్తీకి గతంలోనే ఆర్థిక శాఖ అనుమతి లభించినప్పటికీ, ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల కాకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement