మన పత్రిక, వెబ్డెస్క్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, అనుబంధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విశేష సేవలు అందించిన 60 మంది అధ్యాపకులకు అవార్డులు ప్రకటించింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నలుగురు, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ, వీరనారి చాకలిఐలమ్మ మహిళా, డా. బి.ఆర్. అంబేడ్కర్ విశ్వవిద్యాలయాల నుంచి ఒక్కొక్క అధ్యాపకుడిని అవార్డులకు ఎంపిక చేసింది.
ఈ అవార్డుల జాబితాను ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. ఇది అధ్యాపక సంఘానికి ప్రోత్సాహకరంగా నిలుస్తుంది. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 49 మంది ఉత్తమ ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరిలో 10 మంది జీహెచ్ఎం/ప్రిన్సిపాల్స్, 21 మంది స్కూల్ అసిస్టెంట్లు, పీడీలు, ఎల్ఎఫ్ఎల్లు, 12 మంది ఎస్జీటీ, పీఈటీ, లాంగ్వేజ్ పండిట్లు, టీజీటీలు ఉన్నారు. అలాగే ఎయిడెడ్ స్కూల్ టీచర్లు ముగ్గురు, మోడల్ స్కూల్ టీచర్లు ఇద్దరు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం నుంచి ఒకరు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

