Advertisement
Telangana news g1 houses

Telangana: G+1 ఇళ్లు, 5 లక్షల సహాయం కీలక నిర్ణయం

Telangana: G+1 ఇళ్లు, 5 లక్షల సహాయం: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisement

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఒక పెద్ద ఊరట ఇచ్చింది. జి ప్లస్ 1 తరహాలో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తూ, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని దశలవారీగా అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశంలో ప్రకటించారు.

Advertisement

ఈ నిర్ణయం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఇంటి స్థలం లేక అసౌకర్యాలు ఎదుర్కొంటున్న పేదలకు గృహ నిర్మాణ సౌకర్యం లభిస్తుంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఈ సౌకర్యాన్ని అందిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు కూడా ఈ అవకాశం వచ్చింది.

ప్రతి ఇంటి విస్తీర్ణం 30 చదరపు మీటర్లు (96 చదరపు అడుగులు) ఉండాలి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో ప్రతి అంతస్తులో 200 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. ఇంటిలో కనీసం రెండు గదులు, 35.5 చదరపు అడుగుల వంటగది ఉండాలి. ప్రతి ఇంటికి ప్రత్యేకంగా టాయిలెట్, బాత్రూములు తప్పనిసరి. నిర్మాణం R.C.C. స్లాబ్ తో పాటు D.E.E. అనుమతి తీసుకోవాలి.

Advertisement

ఆర్థిక సహాయం నాలుగు దశల్లో అందజేయబడుతుంది. మొదటి దశలో రూప్ లెవెల్ వరకు నిర్మాణం పూర్తయితే ఒక లక్ష రూపాయలు. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష. ఫస్ట్ ఫ్లోర్ కాలమ్స్, స్లాబ్, గోడలు పూర్తయిన తర్వాత రెండు లక్షలు. చివరి దశలో ఇల్లు పూర్తి అయిన తర్వాత మరో లక్ష రూపాయలు అందజేయబడతాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ పథకం పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఉద్దేశించబడింది. ప్రభుత్వం అన్ని పట్టణాల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement