Advertisement

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (Employees Health Scheme) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. ఈ మేరకు రేపు సెక్రటేరియట్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభం

రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన నూతన ఈహెచ్ఎస్ (EHS) పోర్టల్‌ను కూడా ఆయన లాంచ్ చేయనున్నారు.

Advertisement

హెల్త్ కార్డుల పంపిణీ

ఈ కొత్త పథకంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. ఈ విధానం అమలులోకి రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన మరియు వేగవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

Advertisement