ఏకీకృత నియామకం కోసం ప్రభుత్వం ప్రణాళిక
తెలంగాణలోని 4 ప్రధాన విద్యుత్ సంస్థల్లో కలిపి 3000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రతి సంస్థ సొంతంగా నోటిఫికేషన్లు జారీ చేసి, వేర్వేరు పరీక్షలు నిర్వహించేవి. ఇప్పుడు ఈ పద్ధతిని మార్చి, ఒకే నోటిఫికేషన్, ఒకే పరీక్ష ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ మార్పు అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడనుంది. ఒకే పరీక్ష రాసి, బెస్ట్ పోస్టుకు ఎంపిక అయ్యే అవకాశం లభిస్తుంది.
ప్రస్తుత ఖాళీల వివరాలు
ప్రస్తుతం నాలుగు సంస్థల్లో మొత్తం 934 ఖాళీలు ఉన్నాయి.
- ఉత్తర తెలంగాణ డిస్కం: 394
- జెన్కో: 283
- దక్షిణ తెలంగాణ డిస్కం: 135
- ట్రాన్స్కో: 122
ఇవి పక్కన పెడితే, యాదాద్రి, రామగుండం థర్మల్ ప్లాంట్లు, సౌర విద్యుత్ కేంద్రాల విస్తరణతో దాదాపు 2000 కొత్త ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది.
అభ్యర్థులకు ఉత్తమ అవకాశం
ఇప్పటివరకు అభ్యర్థులు ఒకేసారి పలు పరీక్షలు రాయాల్సి వచ్చేది. కొందరు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందినా, ఒకదానికి మాత్రమే చేరేవారు. దీంతో మిగిలిన పోస్టులు ఖాళీగా ఉండేవి.
ఇప్పుడు ఏకీకృత ప్రక్రియ ద్వారా ఈ సమస్య పరిష్కారం కానుంది. అభ్యర్థులకు సమాన అవకాశం, సంస్థలకు సమర్థవంతమైన నియామకం లభిస్తుంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

