Advertisement

డీజీపీ ఆసక్తికర రియాక్షన్.. వైరల్ అవుతున్న సీనియర్ జర్నలిస్ట్ పోస్ట్!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలుగు రాష్ట్రాల నక్సలైట్ల చరిత్రలో ‘కత్తుల సమ్మయ్య’ది ఓ ప్రత్యేకమైన, వివాదాస్పదమైన అధ్యాయం. నక్సలైట్లకు కోవర్టుగా మారి, పోలీసులకు సహకరించి, పీపుల్స్‌వార్ ఉద్యమాన్ని దెబ్బతీసిన సమ్మయ్య ఉదంతం అప్పట్లో సంచలనం. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ (ఇంటెలిజెన్స్) శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ వేముల సత్యనారాయణ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

డీజీపీ రియాక్షన్: నిన్న ఓ జర్నలిస్ట్ కత్తుల సమ్మయ్య గురించి ప్రశ్నించగా.. “అది మన సబ్జెక్ట్ కాదు.. ఎప్పుడో దాటిపోయాం (Closed Chapter)” అని డీజీపీ నవ్వుతూ సమాధానం దాటవేశారని, ఆ ఆన్సర్ తనకు నచ్చిందని సత్యనారాయణ తన పోస్టులో పేర్కొన్నారు.

Advertisement

అసలేం జరిగింది? (జర్నలిస్ట్ పోస్ట్ సారాంశం): గతంలో డీజీపీ హెచ్.జె. దొర హయాంలో సమ్మయ్యను పోలీసులు శ్రీలంక పంపారని, అక్కడ విమాన ప్రమాదంలో అతను చనిపోయాడని సత్యనారాయణ గుర్తుచేశారు. అప్పట్లో డీజీపీ ఆఫీస్ “Sammayya is no more” అని ఓ ప్రముఖుడికి ఇచ్చినట్లుగా ప్రెస్ నోట్ ఇవ్వడం, సమ్మయ్య భార్యకు అత్యవసరంగా పాస్‌పోర్ట్ ఇప్పించి శ్రీలంక పంపడం, బేగంపేట ఎయిర్‌పోర్టుకు మృతదేహాన్ని తీసుకురావడం వంటి ఘటనలపై తాను రాసిన బ్యానర్ కథనాలు అప్పట్లో పోలీసు వర్గాల్లో కలకలం రేపాయని ఆయన రాసుకొచ్చారు.

Advertisement