మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన మరో 17 మంది మావోయిస్టులు లొంగిపోతే తెలంగాణ ‘మావోయిస్టు రహిత రాష్ట్రం’గా నిలుస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన వారు కేవలం 17 మందే మిగిలి ఉన్నారని ఆయన వెల్లడించారు.
వీరి వివరాలను వెల్లడిస్తూ.. కేంద్ర కమిటీలో నలుగురు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్ గ్రౌండ్లో ఇద్దరు ఉన్నారని, ఇందులో ఐదుగురు మహిళలు ఉన్నారని డీజీపీ వివరించారు. ఈ 17 మంది తలలపై ప్రభుత్వం మొత్తం రూ.2.25 కోట్ల రివార్డు ప్రకటించిందని పేర్కొన్నారు.
‘ఆపరేషన్ కగార్’ గడువు లోపే రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిస్తే పోలీసు శాఖ నుంచి వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
