తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం మూడు గంటలకు మంత్రి మండలి సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు, పారుదల శాఖ లు వంటి అంశాలపై కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈ సమావేశం ఏ నేపథ్యంలో జరుగుతోందంటే – స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఉన్నత న్యాయస్థానాలు స్టే విధించడం, సుప్రీంకోర్టు పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని సూచించడం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి.
ఇంకొక ముఖ్య అంశం – బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌గా ఉంది. దీనిపై కూడా మంత్రి మండలి చర్చించే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై ఆగిపోయింది. ఈ సమస్యపై మంత్రి మండలి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

