మన పత్రిక, వెబ్‌డెస్క్
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై, తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగిన వేడుకలు నేడు సద్దుల బతుకమ్మతో ముగిశాయి.
Advertisement
ఈ రోజు పెద్ద పెద్ద బతుకమ్మలు, పసుపు గౌరమ్మ, ఐదు రకాల నైవేద్యాలతో విశేషంగా జరుపుకుంటారు. రాగి పల్లెంలో కుంకుమ, పసుపు, గునుగు, బంతిపూలు లాంటి రంగులతో త్రికోణంగా అలంకరిస్తారు. కొందరు నిలువెత్తు బతుకమ్మలు, కాగితాలతో కూడా తయారు చేస్తారు.
సాయంత్రం ఇంటి ముందు ముగ్గులు వేసి, బతుకమ్మ, గౌరమ్మ, నైవేద్యాలను ఉంచి, మహిళలు చుట్టూ ఆడి పాడతారు. చివరికి చెరువులో నిమజ్జనం చేసి, నైవేద్యాలు పంచుకుంటారు. పుట్టింటికి వచ్చిన అమ్మాయిలు, కన్నవారితో కలిసి ఆనందం పంచుకుంటారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
