Advertisement
Telangana bandh november 3

Telangana Bandh: కాలేజీల బంద్.. ₹900 కోట్లు బకాయిలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు (Telangana bandh november 3) నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తక్షణమే రూ. 900 కోట్లు విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (FATHI) డిమాండ్ చేసింది.

Advertisement

బకాయిల కారణంగా సిబ్బందికి జీతాలు, బిల్లులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ బంద్‌కు ఫ్యాకల్టీ అసోసియేషన్లు, విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.

Advertisement

నిధులు దశలవారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా, యాజమాన్యాలు నమ్మడం లేదు. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే బంద్‌ను నిరవధికంగా కొనసాగిస్తామని ‘ఫాథీ’ హెచ్చరించింది. ఈ బంద్ కారణంగా రేపటి నుంచి తరగతులు, పరీక్షలు నిలిచిపోయే అవకాశం ఉంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement