Advertisement

700 కోట్లు జమ – తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు శుభవార్త

Telangana News: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు సెప్టెంబర్ నెలకు గానూ 700 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు. ఉద్యోగుల సంఘాల నాయకులకు ఈ విషయం అధికారికంగా తెలిపారు. రెండు రోజుల్లోనే ఈ మొత్తం జమ చేస్తారని సమాచారం. సరెండర్, TSGLI, GPF బిల్లులు కూడా ఈ దశలో విడుదల అవుతాయనే ఆశ ఉంది. ఈ నిర్ణయం ఉద్యోగులకు ఊరట కలిగించింది. పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

Advertisement