తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 1,20,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. దీనిలో 1,07,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మిగిలిన 13 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఖాళీలకు కారణాలు పలురకాలు. కొందరు ఉపాధ్యాయులకు పదోన్నతులు రావడం, మరికొందరు పదవీ విరమణ పొందడం వల్ల ఖాళీల సంఖ్య పెరిగింది.
ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇది ఉద్యోగార్థులకు ఆశ కలిగించింది. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం 1000కి పైగా ఫ్రీ ప్రైమరీ పాఠశాలలను మంజూరు చేసింది. వీటిలో శాశ్వత ఉపాధ్యాయులను నియమిస్తే, మరో 2 వేల పోస్టులు పెరిగే అవకాశం ఉంది.
ఇది ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తే, లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

