Tadipatri రాజకీయ ఉద్రిక్తత: కేతిరెడ్డి ఎంట్రీ, జేసీ శివుడి విగ్రహంతో హైటెన్షన్
తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత మరోసారి ముదిరింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి రానున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పోలీసు భద్రతతో ఆయన రానున్నట్లు పోలీసులకు ఆదేశాలు వచ్చాయి.
ఇదే సమయంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రకటించారు. కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పోలీసులు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సూచించినా, జేసీ వర్గం పట్టుపట్టింది.
ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే వైరం ఉంది. ఘర్షణ భయంతో పోలీసులు భారీ బలగాలను మోహరించారు. హైకోర్టు గతంలో పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
రెండు కార్యక్రమాలు ఒకే సమయంలో జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతలు పరిరక్షించేందుకు పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. తాడిపత్రిలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

