మన పత్రిక, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకల వేళ సూర్యాపేట జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచే విస్తృత తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
నిబంధనలు ఇవే:
Advertisement
- రోడ్లపై నిషేధం: రోడ్లమీద వాహన ర్యాలీలు తీయడం, గుంపులుగా హంగామా చేయడం, కేక్ కటింగ్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు.
- మద్యం సేవించడం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, ప్రజలను భయాందోళనకు గురిచేసేలా బాణాసంచా పేల్చినా కేసులు నమోదు చేస్తారు.
- అనుమతి తప్పనిసరి: ఫామ్ హౌస్‌లు, క్లబ్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వేడుకలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. సౌండ్ పొల్యూషన్ నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేయకూడదు.
- వాహనదారులకు అలర్ట్: మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు పెడతారు. త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ల మోడిఫికేషన్‌తో శబ్ద కాలుష్యం చేస్తే వాహనాలను సీజ్ చేస్తారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
