మన పత్రిక, వెబ్డెస్క్: సూర్యాపేట జిల్లా ( Suryapet District ) అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో వీధి కుక్కలు ఓ గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో పది గొర్రెలు మృతి చెందగా, మరో ఆరు తీవ్రంగా గాయపడ్డాయి.
Advertisement
గ్రామానికి చెందిన పగిడి వీరయ్య అనే రైతు రాత్రి సమయంలో తన ఇంటి పరిసరాల్లో ఉంచిన మందపై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలిపారు. గాయపడిన గొర్రెలు చావుబతుకుల మధ్య ఉన్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో తనకు సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. గొర్రెల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్న రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. గ్రామాల్లో కుక్కల బెడదను నివారించాలని అధికారులను కోరారు.
Advertisement
► Read latest Telugu News
► Follow us on Google News
Advertisement
Advertisement
Advertisement

