సూర్యాపేటలో వ్యవసాయ అధికారి ఆకస్మిక తనిఖీ: యూరియా కొరత లేదు.. రైతులకు భరోసా!
మన పత్రిక, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి మంగళవారం పిల్లలమర్రి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా అమ్మకాల తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. సిఫార్సు మేరకే ఎరువులు వాడాలని, అవసరానికి మించి నిల్వ చేసుకోవద్దని రైతులకు సూచించారు.
Advertisement
యాసంగి 2025 సీజన్‌కు సంబంధించి జిల్లాలో యూరియా కొరత లేదని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలోని వివిధ సొసైటీలు, డీలర్లు, గోదాముల్లో 10,508 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. ఇప్పటివరకు 32,910 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామన్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
