Advertisement

సుప్రీంకోర్టు లంబాడా, బంజారా, సుగాలీలకు ఎస్టీ హోదాపై నోటీసులు

మన పత్రిక, వెబ్​డెస్క్ : సుప్రీంకోర్టు ( SUPREME COURT ) లంబాడా, బంజారా, సుగాలీ కులాలకు ఎస్టీ హోదా కల్పించడంపై కేంద్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ లతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.

supreme court st status banjaras lambadis

పిటిషనర్లు ప్రధానంగా చేసిన వాదనలు:

Advertisement
  • లంబాడా, సుగాలీలు 1976 వరకు ఉమ్మడి ఏపీలోని తెలంగాణ జిల్లాల్లో ఎస్టీలుగా గుర్తించబడలేదు.
  • వారు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి స్థానిక గిరిజనుల హక్కులను కొల్లగొట్టారని ఆరోపణ.
  • ఈ వర్గాలు బీసీ జాబితాలో ఉండేవి, తర్వాత ఎస్టీ జాబితాలో చేర్చారు.
  • హైదరాబాద్ స్టేట్ ప్రాంతంలో వారిని ఎస్టీగా గుర్తించలేదు.
  • ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినందున, తెలంగాణలో వీరిని తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్.
  • ఆర్టికల్ 342కి విరుద్ధంగా ఎస్టీ హోదా కల్పించడంతో నిజమైన ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, మాజీ ఎంపీ సోయం బాపూరావు సహా ఇతరులు దాఖలు చేశారు.

Advertisement