మన పత్రిక, వెబ్డెస్క్: ప్రాజెక్ట్ (Sriram Sagar Project) పూర్తి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయం అదే స్థాయిలో నిల్వ ఉంది. ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా ఉండటంతో నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. గేట్ల ద్వారా 59,654 క్యూసెక్కులు వదులుతుండగా, అదనంగా ఎస్కేప్ గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు మాత్రం నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపేశారు.
గోదావరిలోకి (Godavari) భారీగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో, నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు, పశువుల కాపరులు ఎవరూ నదిలోకి వెళ్లవద్దని గట్టిగా సూచించారు. వరద పెరిగితే నీటి విడుదలను మరింత పెంచే అవకాశం ఉందని, రైతులు సైతం జాగ్రత్తగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు, నిజాంసాగర్ ప్రాజెక్టుకు ( Nizam Sagar Project ) సైతం ఇన్ఫ్లో పెరిగింది. ఎగువన సింగూరుకు వరద భారీగా వస్తుండటంతో, నిజాంసాగర్ నుంచి 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా 17.8 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉంది. అలాగే, నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టుకు (Pocharam Project) చాలా రోజుల తర్వాత ఇన్ఫ్లో పెరగడంతో, ప్రాజెక్టు అలుగుపై నుంచి నీరు ప్రవహిస్తోంది.

► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

