Advertisement

Srikakulam | పింఛన్ భయంతో భార్యాభర్తల ఆత్మహత్య

మన పత్రిక, వెబ్​డెస్క్ : శ్రీకాకుళం జిల్లా ( Srikakulam District ) గార్ల (ఎం) అంపోలులో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Advertisement

Srikakulam Pension Suicide Case

అంపోలుకు చెందిన అంధుడైన అప్పారావుకు దివ్యాంగ పింఛన్ కు సంబంధించి ఇటీవల అనర్హత నోటీసులు అందాయి. పింఛన్ రద్దు కావడంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని భయపడి, మనస్తాపానికి గురయ్యారు.

Advertisement

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భార్య లలిత, కుమార్తె దివ్యతో కలిసి భోజనంలో ఎలుకల మందు కలిపి తాగారు.

ఈ ఘటనలో అప్పారావు, భార్య లలిత అక్కడికక్కడే మరణించారు. కుమార్తె దివ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పింఛన్ నోటీసులు, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement