మన పత్రిక, సినిమా: టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ఈ ఏడాది వరుస సినిమాలను విడుదల చేసి ప్రేక్షకులకి పూర్తి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తక్కువ గ్యాప్‌లో రెండు సినిమాలను రిలీజ్ చేసి బాక్సాఫీస్‌లో హల్చల్ సృష్టించారు. ఫిబ్రవరి 27, 2026న విడుదలైన విష్ణు విన్యాసం రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలో, మార్చి 6న మృత్యుంజయ్ అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌తో మరోసారి థియేటర్లలోకి వచ్చారు. ఈ రెండు భిన్న జానర్ల సినిమాలు శ్రీ విష్ణు వెర్సటిలిటీని చూపిస్తున్నాయి.
ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ అయిన మృత్యుంజయ్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ద్వారా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించి, సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప శర్మ కీలక పాత్రలు పోషించారు. సంగీతం కాల భైరవ అందించారు. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రానికి సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మాతలు. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ‘మృత్యుంజయ్’ ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఆప్షన్‌గా నిలవనుంది. ఇప్పటివరకు థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు డిజిటల్లో చూసి ఎక్స్క్లూసివ్ అనుభవం పొందగలరు.
