మన పత్రిక, జాబ్స్: తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ తీర్పు తమ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రూప్-1 నియామకాలపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసి హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం, సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటగా నిలుస్తుందన్నారు.
“ఏళ్ల తరబడి కష్టపడి, అనిశ్చితిలో కాలం గడిపిన గ్రూప్-1 ఆశావహులకు ఈ తీర్పు న్యాయం చేసింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు నిర్వహించి, తక్కువ సమయంలోనే నియామకాలు పూర్తి చేశాం” అని తెలిపారు. అలాగే ఈ నియామకాలను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నాయని, వాటిని విజయవంతంగా తిప్పికొట్టామని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తొలి గ్రూప్-1 అధికారులుగా యువతను భాగస్వామ్యం చేశామని పేర్కొన్నారు. Telangana Public Service Commission వ్యవస్థను సంస్కరించి, నిరుద్యోగ యువతలో విశ్వాసాన్ని పునరుద్ధరించామని సీఎం తెలిపారు. నియామకాలను పారదర్శకంగా పూర్తి చేసిన టీజీపీఎస్సీ ఛైర్మన్, సిబ్బందిని అభినందించారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
