హైదరాబాద్: తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.06 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొత్త కార్డులను ఆధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించినట్లు చెప్పారు.
స్మార్ట్ రేషన్ కార్డు సంబంధిత వివరాలను ఈ వెబ్సైట్ ద్వారా పరిశీలించవచ్చు.
ప్రతి నెలా 6 కిలోల సన్న బియ్యం
పేదలకు ప్రతి నెలా 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా అందిస్తున్నామని సీఎం తెలిపారు. నాణ్యమైన సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం రూ.14,800 కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు.
గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని చాలామంది వినియోగించేవారు కాదని, అది ఇతర ప్రాంతాలకు మళ్లిపోయేదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాణ్యమైన బియ్యం అందించడం ద్వారా పేదలకు ప్రయోజనం కలుగుతోందన్నారు.
రేషన్ కార్డులపై సీఎం వ్యాఖ్యలు
రేషన్ కార్డు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.
ఇదే కార్యక్రమంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులకు తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.75,000 కోట్ల వడ్డీ చెల్లిస్తోందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చి సంక్షేమం వైపు నడిపిస్తున్నామని తెలిపారు.
సంగారెడ్డి పర్యటనలో భాగంగా సీఎం నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించి, అనంతరం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- Police Jobs Age Limit: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు మరో 2 ఏళ్ల వయో సడలింపు
- Telangana Weather: తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు, ఉరుములు.. IMD అలర్ట్
- Hyderabad Double Decker Flyover: హైదరాబాద్లో కొత్త ప్రతిపాదన
- తెలంగాణలో ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు
- ప్రాథమిక పాఠశాలల పరిరక్షణకు ఐక్య పోరాటం చేయాలి: కలవల శంకర్
