తెలంగాణ రాష్ట్రంలోని గౌరవ ముగ్గురు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, 8 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల, 40 రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు విజ్ఞప్తి.
విషయం: ప్రాథమిక పాఠశాలల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించి, జీవో నెం.25ను సవరించేందుకు ఐక్యంగా కృషి చేయాలని విజ్ఞప్తి.
విద్యావ్యవస్థకు ప్రాథమిక పాఠశాలలు పట్టుకొమ్మలైతే, ఉపాధ్యాయ సంఘాలకు SGTలు,PSHM లు పట్టుకొమ్మలు.. సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో జులై 31,2026 వరకు 1,03,550 మంది ఉపాధ్యాయులు పని చేయుచుండగా, అందులో సుమారు 48 వేల మంది SGT లు, మరియు సుమారుగా 4000 మంది PSHM ప్రాథమిక పాఠశాలలో పని చేయుచున్నారు, ప్రాథమిక పాఠశాలల పరిరక్షణకు ఆటంకం అయినా జీవో నెంబర్ 25 సవరణ గురించి ఉపాధ్యాయ సంఘాలు బాధ్యతగా స్పందించాల్సిన అవసరం ఉంది.
ప్రాథమిక పాఠశాలలకు 1:30 నిష్పత్తిని సవరించి, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి పాఠశాలకు హెడ్మాస్టర్, సబ్జెక్ట్ వారీగా తెలుగు, గణితము, ఇంగ్లీష్, పరిసరాల విజ్ఞానం ఉపాధ్యాయులు ఉండేలా కార్యచరణ ప్రకటించాలి.
జీవో నెం.25 అమలు వల్ల ఉపాధ్యాయుల సర్దుబాటుతో విద్యార్థులు అధికంగా ఉన్న పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతోంది. దీనివల్ల ప్రాథమిక విద్య నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. విద్యార్థులకు ప్రాథమిక విద్యలోని కనీస సామర్ధ్యాలు కూడా రావడం లేదు.
ఇటీవల గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయ సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ “పిల్లల కోసం నాతో పోరాడండి” అని పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఆ పిలుపును స్ఫూర్తిగా తీసుకొని పేద, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రాథమిక పాఠశాలల పరిరక్షణను ఉమ్మడి ఎజెండాగా తీసుకోవాలని కోరుతున్నాను.
ప్రాథమిక విద్య పరిరక్షణకు ఐక్యంగా పోరాడేందుకు ఇదే సరైన సమయం. జీవో నెం.25 సవరణను ప్రధాన డిమాండ్‌గా స్వీకరించి, ప్రాథమిక పాఠశాలలను కాపాడేందుకు ఐక్య పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇట్లు,
కలవల శంకర్
SGT, ఆదిలాబాద్
📱 9440750178

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
ఇవి కూడా చదవండి :
- Sriram Sagar Water Level: ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. తాజా పరిస్థితి
- 2615 ఉద్యోగాలు.. 10th, 12th పాస్ వారికి ఛాన్స్ | Army AOC Recruitment 2026
- Double Salary Scam: నకిలీ ఆధార్‌తో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు జీతాలు?
- Telangana Rain Alert: రాష్ట్రంలో తగ్గనున్న వర్షాలు.. హైదరాబాద్‌లో పరిస్థితి ఇదే
- Bonalu Holiday 2026: తెలంగాణలో స్కూళ్లకు సెలవు.. పూర్తి వివరాలు
