స్కోడా ఆటో ఇండియా తన అన్ని మోడల్స్ పై పెద్ద ఎత్తున ధరలు తగ్గించింది. 2025 సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీ రేటు 28% నుంచి 18%కి తగ్గించడంతో, ఈ ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు అందిస్తున్నారు.
ఈ ధర తగ్గింపు వల్ల స్కోడా కార్లు మరింత అందుబాటులోకి రానున్నాయి. ప్రతి మోడల్ పై ధరలు గణనీయంగా తగ్గాయి.
Skoda kylaq new gst rate
స్కోడా లైనప్ లో కైలాక్ కు అత్యధిక ధర తగ్గింపు వచ్చింది. టాప్ వేరియంట్ ప్రెస్టీజ్ 1.0 TSI AT పై ₹1.19 లక్షలు తగ్గాయి. బేస్ వేరియంట్ కు ₹70,000 తగ్గింపు.
| Variant | Old price | New price | Reduction |
|---|---|---|---|
| Prestige 1.0 TSI AT | 13.99 | 12.80 | ₹1.19L |
| Signature+ 1.0 TSI MT | 11.30 | 10.34 | ₹0.96L |
| Classic 1.0 TSI MT | 8.25 | 7.55 | ₹0.70L |
Skoda Kushaq new gst rate
కాంపాక్ట్ ఎస్యూవీ కుషాక్ పై కూడా భారీ తగ్గింపు. 1.5 TSI వేరియంట్స్ పై ₹65,828 తగ్గాయి. బేస్ క్లాసిక్ వేరియంట్ పై ₹37,897 తగ్గింపు.
| Variant | Reduction |
|---|---|
| Monte Carlo 1.5 TSI DSG | ₹66,000 |
| Sportline 1.0 TSI MT | ₹52,000 |
| Classic 1.0 TSI MT | ₹38,000 |
Skoda Slavia new gst rate
సెడాన్ స్లావియా టాప్ వేరియంట్స్ పై ₹63,207 వరకు తగ్గింపు. బేస్ మోడల్ పై ₹49,100 తగ్గింపు.
| Variant | Reduction |
|---|---|
| Monte Carlo 1.5 TSI DSG | ₹63,000 |
| Signature 1.0 TSI MT | ₹47,000 |
| Classic 1.0 TSI MT | ₹49,000 |
Skoda Kodiaq new gst rate
ప్రీమియం ఎస్యూవీ కొడియాక్ పై కూడా భారీ తగ్గింపు. టాప్ L&K వేరియంట్ పై ₹3.28 లక్షలు తగ్గాయి.
| Variant | Reduction |
|---|---|
| Selection L&K 2.0 TSI AT | ₹3.28L |
| Sportline 2.0 TSI AT | ₹3.13L |
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. రాష్ట్రాన్ని బట్టి ధరలు కొంచెం మారుతాయి. స్థానిక డీలర్ దగ్గర ఖచ్చితమైన సమాచారం తెలుసుకోండి.
ఈ ధర తగ్గింపు కారు కొనాలనుకునే వారికి గొప్ప అవకాశం. ప్రీమియం ఫీచర్లు, స్పేస్, పనితీరు కావాలనుకునే వారు ఇప్పుడు సరైన సమయంలో కొనుగోలు చేయవచ్చు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

