Advertisement

Sircilla Municipality Elections: సిరిసిల్ల మున్సిపల్ పీఠం జనరల్ మహిళకు.. బీసీలకు నిరాశేనా?

మన పత్రిక వెబ్​డెస్క్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల మున్సిపల్ ఛైర్మన్ పీఠం రిజర్వేషన్ మార్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఈ స్థానాన్ని ‘జనరల్ మహిళ’ (General Women) కేటగిరీకి కేటాయించడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ బీసీ (పద్మశాలి) సామాజిక వర్గానికి చెందిన నేతలే ఏకచక్రాధిపత్యం వహిస్తూ వచ్చారు.

అయితే, చుట్టుపక్కల గ్రామాల విలీనం, తాజా రిజర్వేషన్ మార్పుతో పీఠం బీసీల చేజారిపోతుందా? అనే ఆందోళన ఆ వర్గంలో నెలకొంది. జనరల్ మహిళకు అవకాశం దక్కడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొత్త అభ్యర్థుల కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.

Advertisement

దీంతో సిరిసిల్ల రాజకీయాల్లో రానున్న రోజుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Advertisement