Advertisement

సింగరేణికి జాతీయ స్థాయిలో ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు

మన పత్రిక, వెబ్​‌డెస్క్

పెద్దపల్లి: సింగరేణి సంస్థకుల(Singareni) జాతీయస్థాయిలో మరో గొప్ప గౌరవం దక్కింది. పర్యావరణ పరిరక్షణ, సంక్షేమం, భద్రతా చర్యల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను సింగరేణిలోని నాలుగు గనులకు కేంద్ర ప్రభుత్వం ‘ఫైవ్ స్టార్ రేటింగ్'(Five Star Rating) అవార్డులను ప్రకటించింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఈ అవార్డులను అందుకున్నారు.

Advertisement

ఈ అవార్డులు పొందిన గనుల్లో ఆర్‌జీ ఓసీ-1 ఎక్స్‌టెన్షన్, జేకే-5 ఓసీ, ఆర్‌కే-6, ఆర్‌కే న్యూటెక్ ఉన్నాయి. ఈ అరుదైన గుర్తింపు సాధించినందుకు గనుల యాజమాన్యాలను, కార్మికులను సీఎండీ బలరామ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సింగరేణి ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసింది.

Advertisement