Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శరద్ పవార్ భేటీ

మన పత్రిక: ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, తన కుమార్తె ఎంపీ సుప్రియా సూలేతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చిన శరద్ పవార్‌కు ప్రధాని మోదీ స్వయంగా ఆత్మీయ స్వాగతం పలికారు. నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశంలో శరద్ పవార్ ప్రధానంగా రైతుల సమస్యలు మరియు సాగుకు సంబంధించిన ఇబ్బందులపై ప్రధానికి ఒక మెమొరండమ్‌ను సమర్పించారు. సమావేశం ముగిసిన వెంటనే సుప్రియా సూలే ప్రతిపక్షాల భేటీకి హాజరయ్యారు. అయితే, ఈ భేటీ కేవలం రైతుల సమస్యలకే పరిమితం కాలేదని, దీని వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం కోసం కేంద్రం మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉండటం, మహారాష్ట్ర రాజకీయాల్లోని తాజా పరిణామాల నేపథ్యంలో ఈ హైప్రొఫైల్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement
Advertisement