ఈ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా చౌటుప్పల్ మండలంలో అన్ని ప్రాధమిక పాఠశాలలో పని చేస్తున్నా SGT లను కలిసి వారికి సభ్యత్వం అందచేయడం జరిగింది. SGT ఉపాధ్యాయుల అందరి నుండి చాలా చక్కని స్పందన రావడం జరిగింది. ప్రతి SGT ఉపాధ్యాయుడు SGTU లో సభ్యత్వం తీసుకొని SGTU సంఘం బలోపేతానికి కృషి చేయాలని, SGT ల సమస్యల పట్ల మాట్లాడే మరియు హక్కుల కోరకై పోరాడే సంఘం, SGT ల MLC ఓటు హక్కు కోసం కృషి చేస్తున్నా SGTU మాత్రమే అని జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బత్తుల దశరథ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కె. రవి, మండల కన్వీనర్ బి. రామి రెడ్డి,పోచంపల్లి మండలం అధ్యక్ష, కార్యదర్శులు M. నాగేందర్ రెడ్డి, కె. శ్రీధర్ మరియు సంఘ గౌరవ అధ్యక్షులు పులిచింతల శ్రీనివాస్ రెడ్డి,ఉప అధ్యక్షులు A. బాలబాబు, జిల్లా కార్య దర్శి N. రాములు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బోయ శ్రీనివాసులు పాల్గొన్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

