మన పత్రిక: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు. తన కుమారుడు చేసిన బైక్ ప్రమాద కేసులో సీదిరి అప్పలరాజు కుట్ర చేశారనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసం నుంచి పోలీసులు అప్పలరాజును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో ఆయన ఇంటి వద్ద వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ బైక్ ప్రమాదంలో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందాడు. తన కుమారుడిని ఈ కేసు నుంచి కాపాడేందుకు అప్పలరాజు కుట్ర చేశారని, ప్రమాదానికి సంబంధం లేని మరో వ్యక్తిని కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అంతేకాకుండా, బాధిత కుటుంబాన్ని ప్రలోభపెట్టారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ ఖాతాపై ఆరోపణలు
- ఏలూరులో చైన్ స్నాచర్ అరెస్ట్, బంగారు ఆభరణం స్వాధీనం
- నీట్ పరీక్ష నిరసనలకు మద్దతు తెలిపినందుకు మోహన్‌లాల్ కుమార్తె విస్మయపై ట్రోలింగ్
- నడిరోడ్డుపై ఆగిపోయిన కారును తోసి యువతికి సాయం చేసిన ఆర్మీ జవాన్
- ముంబైలో నటి ఆయేషా ఖాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
