మన పత్రిక, వెబ్‌డెస్క్ : సిద్దిపేట ( SIDDIPET ) జిల్లా దుబ్బాక ( DUBBAKA ) నియోజకవర్గంలోని అక్బర్పేట, భూంపల్లి మండలాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. పోతరెడ్డిపేట పెద్ద చెరువు నుంచి మత్తడి ప్రవాహం భారీగా వస్తోంది. చిన్న నిజాంపేట వ్యవసాయ పొలాలకు వెళ్లిన రైతులు అకస్మాత్తుగా వరద నీటిలో చిక్కుకున్నారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎస్డిఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో రైతుల వద్దకు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వరద ఉదృతి ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టతరంగా మారింది. అయినప్పటికీ సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రైతులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాయింట్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, తహశీల్దార్ మల్లికార్జున్, సిఐ శ్రీనివాస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
