Advertisement

దృష్టిలోపం ఉన్న విద్యార్థులకూ సైన్స్ కోర్సులు : నారా లోకేష్

మన పత్రిక, వెబ్​‌డెస్క్

Advertisement

అమరావతి: ఇకపై దృష్టిలోపం ఉన్న విద్యార్థులు కూడా సైన్స్ కోర్సులు(Science Courses) చేయెచ్చు. ఈ మేరకు వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం(Andhra Pradesh) విద్యా రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారికి ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదువుకునే అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసింది. తమ భవిష్యత్తుకు దృష్టిలోపం అడ్డుకాకూడదని భావించిన ప్రభుత్వం, మిగిలిన విద్యార్థులతో సమానంగా వారికి అవకాశాలు కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఎంతో మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమమైంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement