Advertisement

SBI ఫౌండేషన్ ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025: రూ.20 లక్షల వరకు

ఎస్‌బీఐ ఫౌండేషన్ ( SBI Foundation )పేద కానీ ప్రతిభావంతులైన విద్యార్థుల కలలను నెరవేర్చేందుకు ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025 ( Platinum Jubilee Asha Scholarship 2025 ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 23,230 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందజేయనుంది. తొమ్మిదో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ కింద విద్యార్థి కోర్సు మరియు స్థాయి బట్టి ఏటా రూ.15 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం పునరుద్ధరణ కోసం కనీస మార్కులు లేదా CGPA పాటించాలి.

అర్హతలు: గత సంవత్సరంలో 75% మార్కులు లేదా 7 CGPA ఉండాలి. SC/ST విద్యార్థులకు 67.5% మార్కులు లేదా 6.30 CGPA తగినది. కుటుంబ వార్షిక ఆదాయం స్కూల్ విద్యార్థులకు రూ.3 లక్షలు, ఇతరులకు రూ.6 లక్షలు మించకూడదు.

Advertisement

ఐఐటీ, ఐఐఎం, వైద్యం, ఓవర్సీస్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ నవంబర్ 15, 2025 వరకు www.sbiashacholarship.co.in లో సమర్పించాలి.

Advertisement