Advertisement
sbi credit card new charges november 1

SBI Credit Card: నవంబర్ 1 నుంచి కొత్త ఛార్జీలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన క్రెడిట్ కార్డు పేమెంట్లపై ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. క్రెడిట్ కార్డుల ద్వారా వాలెట్లలో రూ. 1000 కంటే ఎక్కువ మనీ లోడ్ చేస్తే 1% ఛార్జీ విధించనుంది. అలాగే, థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా విద్యా రుసుములు (Education Fees) చెల్లించినా 1% రుసుము వసూలు చేయనుంది. అయితే, స్కూల్, కాలేజ్ లేదా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్లు, POS మెషీన్ల ద్వారా నేరుగా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది.

Advertisement

పెంచిన ఈ కొత్త ఛార్జీలు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement