Advertisement

కమెడియన్ నుంచి హీరోగా సత్య కొత్త అవతారం

మన పత్రిక, సినిమా: టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సత్య ఇప్పుడు హీరోగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘జెట్లీ’ అనే చిత్రంతో కథానాయకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ‘వివాహ భోజనంబు’తో హీరోగా మెప్పించిన ఆయన, ఈసారి కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని రిథేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. ‘మత్తు వదలరా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ పాట మంచి స్పందనను అందుకుంటోంది. ఇందులో సత్య తన డ్యాన్స్ స్కిల్స్‌తో కొత్త కోణాన్ని చూపిస్తూ ఆకట్టుకున్నారు.

ఈ పాటకు కాల భైరవ స్వరాలు అందించగా, సాయి సోమయాజులు సాహిత్యం అందించారు. శ్రావణ భార్గవి తన ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు మరింత హైలైట్‌గా నిలిచారు. ఇక మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ విన్నర్ రియా సింఘా హీరోయిన్‌గా పరిచయం అవుతూ గ్లామర్, డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, అజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్, తాజా సాంగ్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కామెడీ, థ్రిల్ మిశ్రమంగా రూపొందుతున్న ‘జెట్లీ’ త్వరలో విడుదల తేదీ ప్రకటించనుంది. సత్యకు హీరోగా ఇది కీలక ప్రాజెక్ట్‌గా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement
Advertisement