Advertisement

మాజీ సర్పంచ్ తల్లి మృతి.. కాంగ్రెస్ నేతల నివాళి

మన పత్రిక, వెబ్​డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గుండాల నరసింహ గౌడ్ మాతృమూర్తి గుండాల ఆండాలు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గ్రామానికి చేరుకుని ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఆండాలు మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, ఈ కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఇట్టే ఇంద్రారెడ్డి, గట్టు యాదయ్య, గుండాల సతీష్, ఉపసర్పంచ్ కోయగూర శ్రీను, యూత్ అధ్యక్షుడు మేడి సంతోష్, ఇతర వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement