Advertisement

సారా టెండూల్కర్ పెళ్లిపై విస్తృతంగా ప్రచారం

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ చిన్న కుమారుడు రాజ్‌వీర్ దేవోల్‌తో సారా పెళ్లి జరగనుందనే ప్రచారం ఊపందుకుంది. ఒక వేడుకలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత వారి కుటుంబాల మధ్య వివాహ చర్చలు జరిగాయని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం 30 ఏళ్ల వయస్సున్న సారా, 32 ఏళ్ల రాజ్‌వీర్ దేవోల్ 2027లో పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కథనాలపై టెండూల్కర్ కుటుంబం కానీ, దేవోల్ కుటుంబం కానీ ఇప్పటివరకు స్పందించలేదు. సన్నీ దేవోల్ కుమారుడైన రాజ్‌వీర్ దేవోల్ 2023లో ‘దోనో’ అనే హిందీ చిత్రంతో నటుడిగా ప్రయాణం ప్రారంభించారు. గతంలో క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో కూడా సారా పేరు ముడిపడి ఉన్నప్పటికీ, దాన్ని కూడా ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు.

Advertisement
Advertisement