కన్నడ నటి పాయల్ చెంగప్ప కథానాయికగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ‘మయూఖ’ సినిమా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. శ్రీ తేజ్ ఎస్కే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకాలాజికల్ థ్రిల్లర్ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ-సర్టిఫికేట్ ఇచ్చింది. అక్టోబర్ 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వీక్షకులకు తెలుగు భాషలో అందుబాటులో ఉంది.
ఈ చిత్రంలో దేవ్ డి, మురళీధర్ గౌడ్, అమన్ మసూద్ కీలక పాత్రలు పోషించారు. శశిధర్ నల్లా నిర్మించిన ఈ చిత్రానికి సిబి మాథ్యూ అలెక్స్ సంగీతం అందించారు. థియేటర్లలో విడుదల కాకముందే ఈ సినిమా న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ మిస్టరీ మూవీ పురస్కారాన్ని దక్కించుకుంది. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రావడంతో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వీక్షకులకు ఇది దగ్గరయ్యే అవకాశం లభించింది.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
