మన పత్రిక వెబ్‌డెస్క్, నల్గొండ: సంక్రాంతి పండుగ ముగించుకొని సొంతూళ్ల నుంచి హైదరాబాద్ నగరానికి తిరిగి వస్తున్న ప్రజలకు నల్గొండ జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65)పై చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా సాఫీగా ప్రయాణించేందుకు పోలీసులు ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను ప్రకటించారు.
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే: ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం ప్రయాణించాలని పోలీసులు కోరుతున్నారు.
- గుంటూరు నుంచి వచ్చే వారు: గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు.
- మాచర్ల రూట్: మాచర్ల నుంచి వచ్చే వాహనాలు నాగార్జునసాగర్, పెద్దవూర, కొండమల్లెపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా వెళ్లడం ఉత్తమం.
- నల్గొండ నుంచి: నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్లే వారు.. నల్గొండ టౌన్, మార్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా ప్రయాణించవచ్చు.
- భారీ వాహనాలు: విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలు కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ రూట్లో వెళ్లాలి.
- ఫ్లైఓవర్ పనులు: చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద రద్దీని తప్పించుకోవడానికి.. చిట్యాల నుంచి భువనగిరి వైపు మళ్లి, అక్కడి నుంచి ఘట్కేసర్, ఓఆర్ఆర్ (ORR) మీదుగా హైదరాబాద్ చేరుకోవడం మేలని సూచించారు.
పటిష్ట నిఘా.. డయల్ 100 ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలన్నదే తమ లక్ష్యమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉంటారని, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ని సంప్రదించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
