మన పత్రిక, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారాయణఖేడ్-బీదర్ జాతీయ రహదారి (NH 161B)పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులను నర్సింహులు (27), మల్లేష్ (24), మహేష్ (23)గా గుర్తించారు. వీరు వరుసకు బావ, బావమరుదులు అవుతారు.
నర్సాపూర్ నుంచి నారాయణఖేడ్ వచ్చి తిరిగి వెళ్తుండగా, శివారులో కొత్తగా నిర్మిస్తున్న హైవే పక్కన ఉన్న కల్వర్టు గుంతలో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్ర గాయాలపాలైన ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
