Advertisement

Sangareddy: హెచ్‌ఎం రేఖ రాణి సస్పెండ్.. ఎస్ఏ-1 పరీక్షల ఉల్లంఘన!

మన పత్రిక, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దెగుల్ వాడి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖ రాణిని జిల్లా విద్యాధికారి (DEO) వెంకటేశ్వర్లు సస్పెండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

గురువారం పాఠశాలను తనిఖీ చేసిన మండల విద్యాధికారి (MEO) రహీమొద్దీన్, విద్యాశాఖ ప్రకటించిన సమగ్ర మూల్యాంకనం (ఎస్ఏ-1) పరీక్షల షెడ్యూల్‌ను ఆమె ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ మేరకు ఎంఈఓ జిల్లా విద్యాధికారికి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా డీఈఓ వెంకటేశ్వర్లు ఆమెను సస్పెండ్ చేసినట్లు ఎంఈవో రహీమొద్దీన్ ధృవీకరించారు.

Advertisement
Advertisement