మన పత్రిక, వెబ్‌డెస్క్: రాజేష్‌తో పాటు కలిసి చదువుకున్న “1994-95 పదవ తరగతి స్నేహబంధం టీం” మిత్రులందరూ కలిసి రూ. 1,04,500 (లక్ష నాలుగు వేల ఐదు వందల రూపాయలు) సేకరించారు. ఈ ఆర్థిక సహాయాన్ని వారు ఆదివారం రాజేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ మొత్తాన్ని వారు నేరుగా చేతికి ఇవ్వకుండా, రాజేష్ కూతురు మౌన్యశ్రీ పేరు మీద పోస్ట్ ఆఫీస్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం విశేషం. అనంతరం ఆ డిపాజిట్ పాస్‌బుక్‌ను రాజేష్ నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులకు అందజేసి పరామర్శించారు. ఈ సందర్భంగా టీం మిత్రులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న స్నేహితులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని కోరారు. భవిష్యత్తులో కూడా రాజేష్ కుటుంబానికి, వారి పిల్లలకు అండగా నిలుస్తామని వారు భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో పున్న యాదగిరి, పొట్ట సత్తయ్య గౌడ్, సురుకంటి రాజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వందనపు నాగేష్, బద్దుల మల్లేష్ యాదవ్, వీరమల్ల అంజయ్య గౌడ్, పిన్నింటి రామిరెడ్డి, పోలోజు వెంకటాచారి, ఈదులకంటి కైలాసం గౌడ్, కొండ్రు మహేష్, సురపల్లి శ్రీనివాస్, శానాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.
చిన్ననాటి స్నేహితులు అందించిన ఈ భరోసా ఆ కుటుంబానికి కొంత ఊరటనిచ్చింది.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

